NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేటి నుంచి సాయంకాలం కూడా స్వామివార్ల స్పర్శదర్శనం

1 min read

పల్లెవెలుగు వెబ్​: భక్తుల సౌకర్యార్థం రేపటి నుండి  సాధారణ రోజులలో సాయంకాలం కూడా భక్తులకు ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 3.00 గంటల వరకు భక్తులకు ఉచితదర్శనం కల్పించబడుతోంది. రేపటి నుంచి ఈ రోజులలో (మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో) సాయంకాల వేళలో 6.30 గంటల నుంచి 7.30గంటల వరకు భక్తులకు స్పర్శదర్శనం కల్పించబడుతుంది.  కాగా గురువారం రోజు జరిగే ఆలయశుద్ధి కార్యక్రమం కారణంగా మధ్యాహ్నం 1.30గంటల నుంచి 2.30 గంటల వరకు స్వామివార్ల స్పర్శదర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. అయితే స్పర్శదర్శన ప్రారంభ మరియు ముగింపు సమయాలకంతా స్వామివారి ముఖమండప ప్రవేశం చేసేవారికి మాత్రమే స్పర్శదర్శనం కల్పించే వీలుంది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా కోరుతున్నాము. అదేవిధంగా స్వామివారి స్పర్శదర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావలసి వుంటుంది. సంప్రదాయ వస్త్రధారణలో పురుషులు పంచ మరియు కండువాను, మహిళలు చీర మరియు రవిక లేదా చున్నీతో కూడిన సల్వార్ కమీజ్లను ధరించవలసి వుంటుంది.

About Author