NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖ నుంచి విదేశాల‌కు.. నౌకాయానం !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : విశాఖ నుంచి విదేశాల‌కు త్వ‌ర‌లో విహార నౌక‌లు ప్రారంభంకానున్నాయి. విహార నౌక‌ల స‌ర్వీసులు ప్రారంభించేందుకు నౌకాశ్రయ అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. విశాఖ నౌకాశ్ర‌యంలో క్రూయిజ్ ట‌ర్మినల్ ప్రారంభించేందుకు టెండర్లు పిలిచారు. ఈ కాంట్రాక్టు ద‌క్కించుకునే సంస్థ సంవ‌త్స‌రంలో పూర్తీ చేయాలి. ఆలోపు విశాఖ న‌గ‌రానికి అంత‌ర్జాతీయ విహార నౌక‌లు వ‌చ్చేలా ఏర్పాట్లు చేయాలి. దేశంలోని ముంబ‌యి, గోవా, కొచ్చి, మంగ‌ళూరు, చెన్నై త‌దిత‌ర నౌకాశ్ర‌యాల‌కు విదేశీ విహార నౌక‌లు వ‌స్తుంటాయి. ఆయా స‌ర్వీసులు న‌డిపే సంస్థ‌ల‌తో మాట్లాడి విశాఖ‌కు కూడ స‌ర్వీసులు ప్రారంభించేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ విహార నౌక‌ల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల‌లోని స‌దుపాయాలు క‌ల్పిస్తారు. రెస్టారెంట్లు, స్విమ్మింగ్ ఫూల్, ఇండోర్ గేమ్స్, థియేర్స్, డాన్స్ ఫ్లోర్స్  ఏర్పాటు చేస్తారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author