PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏ గ్రహం నుంచి వచ్చావో !

1 min read

పల్లెవెలుగువెబ్ : టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్థి ఎవరన్నది తనకు అనవసరం అన్నట్టుగా విరుచుకుపడుతున్నాడు. సూర్య దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు డీలా పడుతున్నారు. నాలుగు ఇన్నింగ్స్ లలో మూడు అర్థ శతకాలను సాధించాడు. గత 5 ఇన్నింగ్స్ లలో 225 పరుగులను సాధించాడు. 193.96 స్ట్రైక్ రేట్ తో సూర్య ప్రభంజనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ పై పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించారు. అతను వేరే గ్రహం నుంచి వచ్చాడని తాను అనుకుంటున్నానని.. ఏ గ్రహం నుంచి వచ్చావు? అని అక్రమ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సూర్య చాలా డిఫరెంట్ అని అన్నారు. 2022లో టీ20లో వెయ్యి పరుగులను సాధించిన ఏకైక క్రికెటర్ సూర్య మాత్రమేనని చెప్పారు.

About Author