‘ఫాంఫండ్’ .. రైతుకు భరోసా
1 min read– నీటిని వృథా చేయకండి..
– ఏపీడీ సద్గుణ
పల్లెవెలుగు వెబ్, మాగనూరు: ప్రతి వర్షపునీటి బొట్టును ఒడిసి పట్టుకుని పంటలను సాగు చేయాలని ఉపాధి హామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సద్గుణ రైతులకు సూచించారు. బుధవారం మాగనూరు మండలం నేడగం గ్రామంలో ఉపాధి హామీ కింద ఫాంఫండ్, నర్సరీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీడీ సద్గుణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద రైతులు తమ పొలాల్లో ఫాండ్ఫండ్ ( నీటితొట్టె)ను చేయించుకోవాలని, అప్పుడు పంట సాగుకు పుష్కలంగా నీరు అందుతాయన్నారు. ప్రతి నీటి చుక్క కూడా వృథా కాదన్నారు. అనంతరం నేరడగందొడ్డి, బైరంపల్లి గ్రామాల్లో రోడ్లకు మొరం వేయటం గురించి, ఉపాధి హామీ పనుల ప్రాధాన్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీడీ సద్గుణతోపాటు సర్పంచ్లు అశోక్ గౌడ్ , తార మారుతి , మంజుల రాఘవేంద్ర, MPTC ఎల్లారెడ్డి, మండల అధికారులు APO సత్యప్రకాష్, EC ప్రసన్న, TA మాణిక్ రావ్ , TA లక్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.