PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగులో.. బావ మరదళ్ల సరదా సంక్రాంతి సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వెండితెర, బుల్లితెరపై ప్రేక్షకులను అలరించే అందాల తారలు అంతా కలిసి ఓకే వేదికపై చేరి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ప్రత్యేక కార్యక్రమం పండగంటే ఇట్టా వుండాలా జనవరి 14న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. యాంకర్ రవి, వర్షిణి ప్రముఖ నటుడు రాజ శేఖర్, ఆయన సతీమణి జీవిత సందడి చేసిన ఈ వేడుక ఆద్యంతం వినోదం, నవ్వులు, ఉత్సాహంతో కోలాహలంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా వాతావరణాన్ని తేలికపరచడానికి అంత్యాక్షరి పోటీ నిర్వహించగా, అందులో పడమటి సంధ్యా రాగం సీరియల్ నటీనటులు, గాయనీగాయకుల మధ్య ప్రధానంగా పోటీ జరుగుతుంది. ఇక, ఆ తర్వాత డ్రామా జూనియర్ కిడ్స్ రాజ శేఖర్, జీవితలకు అంకితమిస్తూ చేసిన స్కిట్ అందరినీ భావోద్వేగానికి గురిచేయడం ఖాయం.ఈ కార్యక్రమంలో వినోదాన్ని రెట్టింపు చేసేందుకు ఫన్-టాస్టిక్ అవార్డుల ప్రకటనతో మరింత సందడి నెలకొంటుంది. చమత్కారంగా మరియు వినోదాత్మకంగా ఉండే ఫెంటాస్టిక్ అవార్డ్స్ లో టీవీ సెలబ్రిటీలు అత్యంత ఉత్తేజకరమైన, ఫన్నీ అవార్డులను తీసుకోడానికి పోటీ పడతారు. వీటిని అత్యంత హాస్యభరితమైన రీతిలో ఎప్పటికీ గుర్తిండేలా అందిస్తారు. ఈ ఫన్-టాస్టిక్ అవార్డుల ప్రదానం తర్వాత ప్రేక్షకులకు మరొక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది జీ తెలుగు. సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది రకరకాల వంటలు, పిండి వంటలు. ఆ సంప్రదాయాన్ని, సంస్కృతిని ఇనుమడించేలా మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు సంఖ్యలో 500 రకాల ఆహార పదార్థాలతో తయారుచేసిన అతిపెద్ద థాలీని తయారు చేసింది. రకరకాల ప్రాంతాలకు చెందిన స్వీట్లు, పిండి వంటలు, పచ్చళ్లు, పొడులు, కూరలు.. ఇలా 500 రకాల వైవిధ్యమైన ఆహారపదార్థాలను ప్రత్యేక నైపుణ్యం గల పాకశాస్త్ర నిపుణులతో చేయించి నోరూరించేలా అతిపెద్ద థాలీని వడ్డించి సంక్రాంతి పండుగ విశిష్టతను చాటారు. రెండో రోజు బావ మరదళ్ల సరదా సంబరంగా ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో శ్యామల, సౌమ్య యాంకర్ గా వ్యవహారించగా జీ తెలుగు పాపులర్ నటీనటులతో పాటు ప్రముఖ నటీనటులు రాశి, ఆమని, సుమన్ పాల్గొని వినోదాన్ని రెట్టింపు చేశారు.  ‘సలార్’ సినిమాలో నటించిన బాల నటులు వేసిన స్కిట్లు, చేసిన అల్లరి ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ఈ సంక్రాంతి వేడుకలో హనుమాన్ చిత్రబృందం కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించనుంది. ఈ జనవరి 14, 15 తేదీల్లో సంప్రదాయం, వినోదం, సంక్రాంతి స్ఫూర్తితో పండుగ జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి, ఆనందం, నవ్వులు మరియు మరపురాని ప్రదర్శనలతో జీ తెలుగు అందిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాలని పండగ వేళ మీరూ మిస్ కాకండి!

About Author