PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మగపిల్లలకు శానిటరీ నాప్కిన్.. నిధుల మంజూరు !

1 min read

పల్లెవెలుగువెబ్ : బీహార్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాలుర కోసం ఓ స్కూల్లో శానిటరీ నాప్కిన్లు కొనుగోలు చేశారు. బాలికలకు ఉద్దేశించిన ‘పోషన్ పథకం’లో బాలురకు శానిటరీ నాప్కిన్లు, ఇతర దుస్తులు కొనుగోలు కోసం నిధులు మంజూరైన ఘటన సరన్ జిల్లాలోని హల్‌కోరీ షా స్కూల్లో వెలుగు చూసింది. ఆ స్కూల్‌లో కొత్తగా నియమితులైన హెడ్‌మాస్టర్ ఈ విషయాన్ని గుర్తించి జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. గత మూడేళ్ల రికార్డుల్లో ఇలాంటివి పలు గుర్తించానని ఆయన పేర్కొన్నారు. కాగా.. తనకు హెడ్‌మాస్టర్ నుంచి లేఖ అందిన విషయాన్ని శరన్ జిల్లా విద్యాశాఖాధికారి శనివారం ధృవీకరించారు. అంతేకాకుండా.. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు ఇద్దరు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

    

About Author