చేతి వృత్తిదారులకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి
1 min read– వృత్తిదారుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయాలి.
– సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలి.
– జనవరి 30 న విజయవాడలో జరిగే వృత్తిదారుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.
– వృత్తిదారుల జిల్లా సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: చేతి వృత్తిదారుల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, వృత్తి దారుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.గురుశేఖర్ కోరారు. ఈ రోజు నందికొట్కూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర గల నంది జూనియర్ కళాశాలలో రజక వృత్తిదారుల సంఘం నందికొట్కూర్ నియోజకవర్గ అధ్యక్షులు పి.విజయ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు సి.గురు శేఖర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు కురుమూర్తి. వృత్తి సంఘాల నంద్యాల జిల్లా కన్వీనర్ సి వెంకటేశ్వర్లు. మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి 70 లక్షల మంది చేతి వృత్తిదారులు వృత్తులుపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించకుండా మోసం చేస్తుందని విమర్శించారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తులనుండి చేతి వృత్తిదారులను దూరం చేస్తూ కార్పెట్ శక్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల వల్ల చేతి వృత్తులు అన్ని ద్వంసం అవుతున్నాయని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే వివిధ పధకాలను రద్దు చేసి, బడ్జెట్ లో కోత విధిస్తూ వృత్తిదారులను దగా చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన నిధులను కూడా వృత్తిదారుల సంక్షేమానికి ఖర్చు చేయటం లేదని, బిసి సబ్ ప్లాన్ 35 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ నిధులు కూడా ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించి వృత్తిదారులకు అన్యాయం చేసిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తిదారుల ఎడల అనుచరిస్తున్న మోసపూరిత చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జనవరి 30 న విజయవాడలో జరిగే రాష్ట్ర వృత్తిదారుల సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు రమేష్. రఘురామమూర్తి. బియస్పి జిల్లా నాయకులు ఎం స్వాములు. బీసీ సంక్షేమ సంఘం తాలూకా నాయకులు బి నాగేశ్వర్. మాల మహానాడు తాలుక నాయకులు చరణ్. చేనేత కార్మిక సంఘం నాయకులు కోటి వెంకటేశ్వర్లు. కెవిపిఎస్ రాష్ట్ర నాయకురాలు రంగమ్మ, వృత్తిదారుల సంఘం నాయకులు శివశంకర్.శివకూమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.