సర్పంచ్లకు నిధులు విడుదల చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచ్ల కు నిధులు, విడుదల చేయాలని సిఐటియు ప్యాపిలి మండల కార్యదర్శి షేక్ అబ్దుల్ రెహమాన్ విలేకరు సమావేశంలో డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12,900 గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచులు నిధులు, లేక ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోతున్నారని, తమను నమ్మి ఓటు వేసి గెలిపించిన గ్రామీణ ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు అన్నారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరచి దారి మళ్లించిన నిధులు 8660 కోట్లను గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని, డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం, గ్రామాల అభివృద్ధి నోచుకోక, నిర్వీర్యం చేశారన్నారు. గత మూడున్నర సంవత్సరములుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన గ్రామపంచాయతీల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు పోతు దొడ్డి. రామాంజనేయులు, పద్మశాలి శ్రీనివాసులు ,ఇలియాజ్, ఫారుక్ పాల్గొన్నారు.