2 రోజుల్లో 100 మృతదేహాలకు అంత్యక్రియలు..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోనా కాటేస్తోంది. కరోన మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒకటికాదు.. రెండు కాదు.. రోజు పదుల సంఖ్యలో మృతదేహాలు స్మశానానికి వెళ్తున్నాయి. వాటిలో కరోన కేసులే అధికం కావడం గమనార్హం. పైకి మాత్రం గుండెపోటుతో చనిపోయినట్టు ధృవీకరిస్తున్నప్పటికీ.. ఎక్కువగా కరోన వల్ల సంభవించిన మరణాలే అని చెబుతున్నారు. గుంటూరు జిల్లా బొంగరాలబీడు స్మశానవాటికకు రెండు రోజుల్లోనే 92 మృతదేహాలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో రోజుకు 4,5 మృతదేహాలు వచ్చేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో వస్తున్నాయని అక్కడి కాటికాపర్లు చెబుతున్నారు. గత సంవత్సరం కరోన అధికంగా ఉన్న సమయంలో కూడ ఈ స్థాయిలో మృతదేహాలు స్మశానానికి రాలేదు. కానీ.. ఇప్పుడు కేవలం నాలుగు రోజుల్లోనే 141 మృతదేహాలు స్మశానానికి వచ్చాయని కాటికాపర్లు చెబుతున్నారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.