అనాధశవానికి అంత్యక్రియలు..
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు, చెన్నూరు శ్రీరామ్ నగర్ నందు గోపయ్య అనే వ్యక్తి బుధవారం అనారోగ్యంతో మృతి చెందగా మానవత సేవ సంస్థ సభ్యులైన ఆవుల బసిరెడ్డి, ఆటో బాబు లు కలసి గోపయ్య మృత దేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు, దీంతో గ్రామంలో పలువురు ప్రజలు మానవత సేవా సంస్థ చేస్తున్న ఇలాంటి కార్యక్రమాల ను చూసి మానవత సేవ సంస్థ సభ్యుల కు అభినందనలు తో పాటు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.