అభి ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధునికి అంత్యక్రియలు
1 min readఅంత్యక్రియలు చేయటం దైవానుగ్రహం అంటున్నా
ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్ విజయబాబు..
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : మనిషికి మనిషే సహాయపడాలని ఒక గొప్ప సంకల్పంతో కమలాపురం నగర పంచాయతీలోని వికలాంగుల కాలనీకి చెందిన మధుర మనీ రావు ఒంటరిగా జీవిస్తూ తినడానికి ఇబ్బందు పడుతుంటే గతంలో ఎస్సై హృషికేశవరెడ్డి సహకారంతో అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్ విజయ్ బాబు అతన్ని చేరదీసి తిప్పలూరు గ్రామంలోని ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమంలో చేర్పించడం జరిగింది, వృద్ధాశ్రమంలో గురువారం రాత్రి అనారోగ్యంతో మధుర మణి రావు మరణించాడని ఆశ్రమ నిర్వాహకులు నాగేంద్ర, అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కు చరవాణి ద్వారా తెలపడంతో శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన అంత్యక్రియలు అభి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంప్రదాయపద్ధంగా చేసిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్ విజయ్ బాబు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధలను అభాగ్యులను ఆదరించడం అన్నం పెట్టడం మహా పుణ్యకార్యం అన్నారు, అలాగే ఎవరు లేకుండా మరణించిన వారికి మేమున్నామంటూ అనాధగా కాకుండా సంప్రదాయపద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని అన్నారు, ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొంటూ మానవత్వం కలిగిన మాకు దైవానుగ్రహంతోనే కార్యక్రమాలన్నీ మా ట్రస్ట్ ద్వారా చేస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వృద్ధాశ్రమం నిర్వాహకుడు నాగేంద్ర ట్రస్ట్ సభ్యులు కార్తీక్, నాని తదితరులు పాల్గొన్నారు.