NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొడాలి నాని దిష్టిబొమ్మ‌కు శ‌వ‌యాత్ర‌.. అంత్య‌క్రియ‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ టీడీపీ నాయకులు కడపలో వినూత్నంగా మాజీమంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వినూత్ననిరసనకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్రకార్యదర్శి సాయినాధ్ శర్మ మాట్లాడుతూ.. కొడాలినాని మదమెక్కిన ఆంబోతులా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. కొడాలినాని పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీఎం జగన్ తనకు మరోసారి మంత్రి పదవి ఇస్తాడనే చంద్రబాబు కుటుంబం పై రెచ్చి పోతున్నాడని ఆరోపించారు.

                        

About Author