NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు  ఫర్నిచర్ వితరణ..

1 min read

– దాతల సహకారంతోనే విద్యార్థులకు మెరుగైన విద్య , సౌకర్యాలు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు సిపిడిసి సభ్యుల ద్వారా కళాశాలలోని మౌలిక వసతుల కొరత గురించి తెలుసుకున్న ఏలూరు శాంతినగర్ నివాసి విశ్రాంత ఇంజనీర్, వితరణశీలి,సంఘ సేవకులు అయిన చందన విష్ణువర్ధనరావు  తన వంతు సహాయంగా విద్యార్థుల సౌకర్యార్థం 2.7 లక్షల రూపాయల విలువైన 30 డెస్కులను కళాశాలకు అందజేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు,అధ్యాపకులు వి వెంకటరావు, ఎం కృష్ణ చైతన్య, టీవీ దుర్గాప్రసాద్ చందన విష్ణువర్ధన్ రావు కి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతు దాత యొక్క ఔదార్యాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని కొనియాడుతు మరింత మంది దాతలు కళాశాల అభివృద్ధి కొరకు తోడ్పడగలరని అన్నారు.డిగ్రీ కళాశాల ఫర్నిచర్ అవసరాన్ని చెప్పిన వెంటనే స్పందించి తన సహకారాన్ని అందించిన  విష్ణువర్ధన్ రావుని సిపిడిసి సభ్యులు ఎల్  వెంకటేశ్వరరావు కొనియాడారు .ఈ సందర్భంగా సిపిడిసి కార్యదర్శి ఇ. రఘబాబు సంతోషం వ్యక్తం చేశారు.

About Author