ఇక నుంచి ఫ్యూజులు కాలవు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఫ్యూజ్ కాలిపోతే వచ్చే ఇబ్బందులను తప్పించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే మినియేచర్ కాంటాక్ట్ సర్క్యూట్ బ్రేకర్ . విజయవాడలో ఎంసీసీబీల ఏర్పాటును మొదలుపెట్టారు. ప్రస్తుతం 40 వేల ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తామని, దశలవారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తామని ఏపీసీపీడీసీఎల్ చెబుతోంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యూజు బాక్సుల స్థానంలో రెండువైపుల ఎంసీసీబీ ఉండే కేబుళ్లు అమర్చారు. విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడినప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి. సమస్య ఉన్న లైనుకు మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపేస్తాయి. లైనులో ఎక్కడ సమస్య వచ్చిందనే విషయాన్ని కూడా సూచిస్తాయి. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం కలుగుతుంది.