PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘భావితరం’ తీర్చిదిద్దేది…గురువులే..: గిరికుమార్​ రెడ్డి

1 min read

ఉపాధ్యాయులపై కేసులు పెట్టి..వేధించడం మంచిది కాదు..

  • ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి

పల్లెవెలుగు:దేశానికి భావితరాలను తీర్చిదిద్దేది  ఒక్క గురువు మాత్రమేనన్నారు ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుండా… వారిని ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. . ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు… ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యమ సమయంలో వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్​ జి. సృజనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరికుమార్​ రెడ్డి మాట్లాడుతూ  గురువులను గౌరవించడం మన సంప్రదాయమని.. తల్లిదండ్రుల తర్వాతి స్ధానం గురువులదేనన్నారు.  అలాంటి వారి కంట నీరు రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదన్నారు.  సీపీఎస్​ రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ .. ఉద్యమం చేపట్టిన ఉపాధ్యాయుల పై  క్రిమినల్​, బైండోవర్​ కేసులు పెట్టడం…దేనికి సంకేతమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాక కొందరు ఉపాధ్యాయులను సస్పెండ్​ చేశారని పేర్కొన్నారు.  ఉపాధ్యాయులను అవమానిస్తూ బోధనేతర పనులు కేటాయించి వారిని హింసించడం వల్ల రాష్ట్రములోని విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతోందని ఆవేదన  వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయలపై  పెట్టిన కేసులు ఎత్తివేసి…వారి సమస్యలు పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమములో APJAC అమరావతి జనరల్ సెక్రటరీ కీ వై  కృష్ణ,  హెడ్మాస్టర్ల సంఘ రాష్ట్ర  అధ్యక్షులు ఓంకార్ యాదవ్ గారు, మునిసిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట రెడ్డి గారు  APTF జిల్లా కార్యదర్శి మరియానందం గారు డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర రావు గారు, టైపిస్ట్ &స్టెనోగ్రాఫర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ గారు పంచాయత్ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపోగు సురేష్ గారు, VRO ల సంఘ ప్రధాన కార్యదర్శి సూరి బాబు పాల్గొన్నారు.

About Author