NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గడపగడపకు వైసీపీ… అడగడుగునా బ్రహ్మరథం..

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లావీరబల్లి:అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో ఆదివారం నిర్వహించిన గడప గడపకు వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ అకేపటి, ఎం ఎల్ ఏ మేడామల్లికార్జున రెడ్డి, మండలాధ్యక్షులు గాలివీటి రాజేంద్రనాధ్ రెడ్డి, గ్రామ సర్పంచులకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మ రధం పట్టారు.రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయ లేదా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రతికుటుంబానికి రైతుబరోసా, సున్నా వడ్డీ, చేనేత హస్తం, తదితర పథకాల ద్వారా రూ ఒక లక్ష నుంచి అయిదు లక్షల వరకు లబ్ది చేకూరిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి సమస్యలున్నావెంటనే పరిష్కరించాలని అదేవిధంగా రాజకీయాలకతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

అత్త మామ లకు ఘన నివాళి

వీరబల్లెలో గాలివీటి సోదరుల స్వగృహంలో నిర్వహించిన  మంత్రి గారి అత్త గారు  మాజీ ఎంఎల్ఏ స్వర్గీయ గాలివీటి విశ్వనాధ రెడ్డి,గారి  సతీమణి రామలక్ష్మమ్మ గారి  ప్రధమ వర్ధంతి వేడుకలలో  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పాల్గొని అత్త, మామలకు ఘన నివాళి అర్పించారు.అనంతరం స్థానిక నాయకులతో ప్రజా సమస్యలపై అరా తీశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా  వై కా పా అధ్యక్షుడు రాయఛోటి ఎం ఎల్ ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా స్థాయి నాయకులు, పలువురు ఎం ఎల్ ఏ లు,పలు మండలాల అధ్యక్షులు,ప్రముఖ పారిశ్రామికవేత్త మోడెమ్  వీరంజనేయ ప్రసాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ బాస్కెర్  మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వడ్డీ వెంకటరామిరెడ్డి తదితరులు.పాల్గొన్నారు.

About Author