కేఏ పాల్ పార్టీలో చేరిన గద్దర్
1 min readపల్లెవెలుగువెబ్: గాయకుడు గద్దర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రజా యుద్ధ నౌకగా తెలంగాణలో ఎంతో పేరు తెచ్చుకున్న గద్దర్.. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న గద్దర్ వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గురువారం నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు. మరోవైపు ఈ నెల 2న పీస్ మీటింగ్ కు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ దీక్షను కేఏ పాల్ విరమించారు. ఆయనకు గద్దర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.