గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడి చర్ల
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గ్రంధాలయ ఉద్యమ పితామహుడు దాడిచర్ల అని గ్రంధాలయ అధికారి రామ్ కుమార్ అన్నారు. పత్తికొండ శాఖ గ్రంథాలయంలో గ్రంధాలయ ఉద్యమ పితామహుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు 140వ జయంతి సందర్భంగా గురువారం గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ గాడిచర్ల చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాడిచర్ల 1883 వ సంవత్సరం సెప్టెంబర్ 14 న భగీరథమ్మ వెంకట్రావు దంపతులకు కర్నూల్లో జన్మించారని రాయలసీమ పేరు వ్యాప్తిలోనికి రావడానికి గాడిచర్ల గ్రంథాలయాభివృద్ధికి దోహదపడ్డారని అన్నారు. ఆ కాలంలో MA డిగ్రీ పొందిన ఆంధ్రుల రెండో వాడని, 1914 నుండి 1916 వరకు ఆంధ్ర పత్రికకు తొలి సంపాదకుడుగా పనిచేశారని తెలిపారు. స్వతంత్ర ఉద్యమంలో గ్రంథాలయాలను స్థాపించి ప్రజలను చైతన్యపరిచి, గ్రంధాలయ ఉద్యమ పితామహుడుగా వెలుగొందాడని కొనియాడారు. గాడి చర్ల హరి సర్వోత్తమ రావును ఆంధ్ర తిలక్ గా ఘనత కెక్కారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు పాఠకులు సురేంద్ర, గ్రంధాలయ సహాయకురాలు నాగరత్నమ్మ పాల్గొన్నారు.