గడివేముల… బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ వెంకటసుబ్బయ్య
1 min read
పల్లె వెలుగు వెబ్:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం నూతన ఎస్ఐగా వెంకటసుబ్బయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని సమస్యలు పై తక్షణమే స్పందిస్తామని, మట్కా, గుట్కా, అక్రమ మద్యం నాటుసారా పై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలని శాంతి భద్రతలకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటసుబ్బయ్య కోరారు.