హైడ్రోజన్ కారులో గడ్కరీ.. !
1 min readపల్లెవెలుగువెబ్ : పెట్రో ధరలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటుకు హైడ్రోజన్ కారులో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడుస్తుంది. కారు ఇంధన ట్యాంకు నింపడానికి 5 నిమిషాలే పడుతుంది. ఒకసారి ట్యాంకు నింపితే 600 కిలోమీటర్లు నడుస్తుంది. కిలోమీటరుకు 2 రూపాయల ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతో అంతా ఈ కారుపై ఆస క్తి చూపుతున్నారు.