లాభాలు ఆవిరి.. ఫ్లాట్ గా సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవల మార్కెట్లో సాగిన బుల్ రన్ లో జోష్ తగ్గింది. ప్రపంచ వ్యాప్తం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. సూచీలు అప్రమత్తంగా కదులుతున్నాయి. ఇటీవల కొనసాగిన లాభాల జోరులో ఇన్వెస్టర్లు ఫ్రాఫిట్ బుకింగ్ కు దిగారు. దీంతో సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. డెల్టా వేరియంట్ ఆందోళన, ఆప్ఘన్ సంక్షోభం, దిగ్గజ కంపెనీలపై చైనా ప్రభుత్వ విధానల వల్ల మార్కెట్లు అప్రమత్తంగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 1:30 సమయంలో సెన్సెక్స్ 147 పాయింట్ల నష్టంతో 55,647 స్థాయి వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 16,571 స్థాయి వద్ద.. బ్యాంక్ నిప్టీ 138 పాయింట్ల నష్టంతో 35,728 వద్ద ట్రేడ్ అవుతోంది.