NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గలమెత్తిన యువగలం నారా లోకేష్ పాదయాత్ర

1 min read

పల్లెవెలుగు వెబ్​ ప్యాపిలి: ప్యాపిలి మండల పరిధిలోని డి .రంగాపురం, నల్ల మేకల పల్లి ,జక్కసానికుంట్ల ,పి ఆర్ పల్లి ,గుడిపాడు గ్రామాలలో గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర గలమెత్తిన యువగలముగా పాదయాత్ర పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఎండని కూడా లెక్క చేయకుండా జాతీయ రహదారి పైన చురుకుగా పాదయాత్ర చేశారు. డోన్ టీడీపీ నియోజకవర్గంలో సుబ్బారాయుడు సుబ్బారెడ్డి ,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ యువగలం పాదయాత్ర విజయవంతంగా తాగింది, నల్ల మేకల పల్లె గ్రామంలో పాదయాత్ర టీడీపీ నాయకులు సత్యం, రాజశేఖర్ అధ్వర్యంలో నిర్వహించగా, అదేవిధంగా జక్కసానిగుంట్ల గ్రామ పరిధిలో జయరాముడు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో క్రేన్ సహాయం తో నారా లోకేష్ కు గజమాలను వేశారు, పి. ఆర్ .పల్లెలో బి. నాగేశ్వరరావు యాదవ్, మాజీ ఎంపీటీసీ గొల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహించి, రాత్రి కావడంతో గుడిపాడు గ్రామంలో నారా లోకేష్ బస చేసేటట్లు డోన్ టిడిపి ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ప్రతినిధులు బనగానపల్లె టిడిపి ఇన్చార్జి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ నాయకులు గౌరు వెంకట రెడ్డి ,శ్రీశైలం టిడిపి ఇన్చార్జి రాజశేఖర్ రెడ్డి ,పాణ్యం టిడిపి ఇన్చార్జి గౌరుచరిత రెడ్డి నంద్యాల ఇన్చార్జి అఖిల ప్రియ, తదితరులు ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author