NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పందెంకోళ్ల జూదరులు అరెస్టు

1 min read
వివరాలు వెల్లడిస్తున్న సీఐ నరేంద్రరెడ్డి

వివరాలు వెల్లడిస్తున్న సీఐ నరేంద్రరెడ్డి

రూ.50వేల నగదు స్వాధీనం
– పల్లెవెలుగు వెబ్​, కడప : రాజంపేట మండలం మన్నూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలో పందెంకోళ్లతో జూదం ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేట డీఎస్పీ ఆదేశాల మేరకు.. మన్నూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఎస్​ఐ ఎస్​కే రోషన్​, సిబ్బంది కలిసి రాజంపేట మండలం అత్తిరాల గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో డబ్బు పెట్టి.. కోళ్ల జూదం ఆడుతున్న శిబిరంపై దాడి చేసి 11 మంది జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50,130 నగదు, 11 పందెం కోళ్ల, 9 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
తమిళనాడు సేలం.. కోళ్లు


ముద్దాయిలను విచారించగా తమిళనాడు సేలం నుండి పందెం కోళ్ళను కొనుగోలు చేసి , వాటికి కత్తులు కట్టి జూదం ఆడుతున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీసు వారు చాకచక్యంగా నిర్వహించి సదరు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేశారు. సీఐ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

About Author