దోమలు వ్యాప్తి చెందకుండా నీటి కుంటల్లో గంబూజియ చేపలు
1 min read
అసిస్టెంట్ మలేరియఅధికారి వెంకటరెడ్డి
చెన్నూరు, న్యూస్ నేడు: గ్రామాలలోని నీటి కుంటల్లో దోమలు ఎక్కువగా ఉంటాయని అలాంటి నీటి కుంటలను గుర్తించి వాటిల్లో దోమలనివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అసిస్టెంట్ మలేరియ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని రామనపల్లి హరిజనవాడలో అలాగే రాచినాయపల్లెలో పర్యటించి అక్కడ ఉన్న మంచినీటి కుంటలను గుర్తించి ఆ మంచినీటి కుంటలలో గంబూజియా చేపలను వదలడం జరిగిందన్నారు. ఈ చేపలు దోమల లార్వాను తినడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా నివారించడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామ ప్రజలు కూడా దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంటి పరిసరాలలో చెత్త చెదారం లేకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఇంటి ఆవరణలో పగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలలో, ఫ్రిజ్జులు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కూలర్ లలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దోమలు వ్యాప్తి చెందకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈకార్యక్రమంలో ఏ. నాగలక్ష్మిరెడ్డి,మలేరియసబ్ యూనిట్ అధికారి మురళి,హెల్త్ సూపర్వైజర్ సుబ్బరామయ్య,ఏ ఎన్ ఎం,లు,ఆశావర్కర్లు పాల్గొన్నారు.