వెయ్యి కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలతో గాంధీ విగ్రహం !
1 min readపల్లెవెలుగువెబ్ : క్విట్ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా 20 అడుగుల మార్చింగ్ మహాత్మా గాంధీ విగ్రహాన్ని యూపీలోని నోయిడా నగరపాలక సంస్థ ఆవిష్కరించింది. ఆ విగ్రహాన్ని ప‍్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రూపొందించారు. హెచ్‌సీఎల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నోయిడా అడ్మినిస్ట్రేషన్ సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి విగ్రహం తయారు చేసింది. ఈ విగ్రహాన్ని సెక్టార్ 137లో ఏర్పాటు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు గుర్తు చేసేలా మహాత్ముడి విగ్రహాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు.