ప్రభుత్వ ఆదాయానికి గండి.. చర్యలు తీసుకోండి.. జడ్పిటిసి
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల పరిధిలోని బిల్కల గూడూరు గ్రామం వద్ద ఉన్న జెఎస్డబ్ల్యు సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందని కంపెనీ ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వానికి గ్రామపంచాయతీకి తప్పుదోవ పట్టించి దాదాపు 30 కోట్ల రూపాయలు ఎగవేసినట్టు శనివారం నాడు జడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు . ప్రతి సంవత్సరం చెల్లించవలసిన లైసెన్స్ ఫీజులు కూడా చెల్లించడం లేదని. గత రెండు సంవత్సరాల క్రితం సోలార్ పరిశ్రమకు ఎటువంటి పంచాయతీ తీర్మానాలు చేయకుండా గ్రామ సభ అనుమతి లేకుండా పనులు చేసి ఉత్పత్తి ప్రారంభించారని ఆరోపించారు దీనిపై గత నెల 24వ తేదీ జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు పరిశ్రమ లోపల పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి పంచాయతీ అప్రూవల్ మరియు కన్స్ట్రక్షన్ ఫీజులు గాని ఇప్పటివరకు చెల్లించలేదని కన్స్ట్రక్షన్ ఏరియా ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు కోటి 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని మండల కేంద్రంలోని గడివేముల గ్రామం నుండి నందికొట్కూరు వెళ్లే రహదారి భారీ వాహనాలు తిరగడం వల్ల ధ్వంసంమైందని గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని ఇప్పటికి రహదారికి మూడుసార్లు మరమ్మత్తు చేశారని భారీ వాహనాలు తిరగడం వల్ల గ్రామంలో దుమ్ము ధూళి విపరీతంగా ఏర్పడుతుందని గడివేముల ప్రజలు శ్వాస కోస వ్యాధులు చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని సమస్యపై పరిశ్రమ యాజమాన్యం స్పందించకపోతే బిలకల గూడూరు గ్రామ నాయకులు మరియు తన ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేయాల్సి ఉంటుందని అవసరమైతే నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.