PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో దొంగల ముఠా… ఏడుగురి అరెస్టు

1 min read

600 గ్రాముల బంగారం,  1800 గ్రాముల వెండి, 1 కారు,  4 బైక్ లు, 

నగదు 70 వేలు,  ఇనుప రాడ్డు,  ఇనుప కట్టర్  స్వాధీనం

27 దొంగతనాలు…రూ.30లక్షల ప్రాపర్టీ రికవరీ

వెల్లడించిన జిల్లా ఎస్పీ సీహెచ్​ సుధీర్​ కుమార్​ రెడ్డి

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లాలో  వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన  రెండు ముఠాలకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సీహెచ్​ సుధీర్​ కుమార్​ రెడ్డి తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలోని వ్యాస్​ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఎస్పీ మాట్లాడారు. కర్నూల్ జిల్లా వ్యాప్తంగా కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు , వెల్దుర్తి, దేవనకొండ, ఆదోని, వెల్దుర్తి, చాగలమర్రి, ఉలిందకొండ, ఎమ్మిగనూరు, పోలీసుస్టేషన్ల పరిధిలో 16 కేసులలో దొంగతనాలకు పాల్పడిన  ఇద్దరిని  శనివారం కర్నూలు సిసియస్  పోలీసులు మరియు కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు కర్నూలులో  అరెస్టు చేసి వారి నుండి మొత్తం 500 గ్రాముల బంగారం, 1200 గ్రాముల వెండి ఆభరణాలు, 1 కారు, ఇంటితాళాలు పగలగొట్టడానికి ఉపయోగించే ఇనుప రాడ్డు మరియు ఒక ఇనుప కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు.  ఈ ముఠాకు సంబంధించి నెల్లూరు జిల్లాకు చెందిన పసుపులేటి ఆనంద్  పరారీలో ఉన్నారు. ఆ నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాము.

11 కేసులలో… ఐదుగురి దొంగలు..

ఉలిందకొండ, కర్నూలు తాలుకా, సి. బెళగల్ , కోడుమూరు మరియు కె.నాగలాపురం  పోలీసుస్టేషన్ల పరిధిలో 11 కేసులలో దొంగతనాలకు పాల్పడిన  ఐదుగురిని ఈ రోజు ఉలిందకొండ పోలీసులు కల్లూరు మండలం, బస్తి పాడు హంద్రీ బిడ్జి పై  అరెస్టు చేసి వారి నుండి మొత్తం 101 గ్రాముల బంగారం, 580 గ్రాముల వెండి ఆభరణాలు, 4 బైకులు, నగదు 70 వేలు , 1 మొబైల్  స్వాధీనం చేసుకున్నారు.  మొత్తం 27 దొంగతనాల కేసులలో  30 లక్షల విలువ గల ప్రాపర్టీ రికవరీ చేసుకున్నారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , ఏక్కడైనా , ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు  సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు.   ఈ దొంగతనాల కేసులను ఛేదించిన  కర్నూలు సిసియస్ ఇన్ స్పెక్టర్ P.శేషయ్య , కర్నూలు నాల్గవ పట్టణ సిఐ బి.శ్రీనివాస రెడ్డి, ఆళ్ళగడ్డ సిఐ N.క్రిష్ణయ్య, కర్నూలు రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, ఉలిందకొండ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి, నాగలాపురం ఎస్సై ప్రేమ, కర్నూలు ఫోర్త్ టౌన్ ఎస్సై రామయ్య, HC-2619 M.V.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు, రంగరావు,  PC-1191 బి.శ్రీనివాసులు, శ్రీనివాసులు, ఎల్లా శివుడు,  జి.జనార్ధన్, రవీంద్రనాయక్, సురేష్, శేఖర్, HG-482 Md.రఫీ లను  జిల్లా ఎస్పీ గారు  ప్రత్యేకంగా అభినందించారు. ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ గారితో పాటు సిసియస్ డిఎస్పీ శ్రీనివాసులు, కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్ ఉన్నారు.

సిసియస్ పోలీసులు అరెస్టు చేసిన  ముద్దాయిల వివరాలు…

1)         చాపల్లి తంబి(28)  (కోండపి గ్రామం, ప్రకాశం జిల్లా.)

2)         చల్లా బాబు (35)  (పోరుమామిళ్ళ , కడపజిల్లా.)

ఉలిందకొండ   పోలీసులు అరెస్టు చేసిన  ముద్దాయిల వివరాలు…

1)         బొజుగు కర్రెన్న @ చిన్న కోతుల కర్రెన్న @ కర్రీ, (30)   (గుడూరు గ్రామం, కర్నూలు జిల్లా)

2)         మల్లపు రాజేష్ (40)  (గుడూరు గ్రామం, కర్నూలు జిల్లా)

3)         మల్లపు అశోక్ @ చెవిటి (28) (గుడూరు గ్రామం, కర్నూలు జిల్లా)

4)         బొజుగు నాగేష్ (36)  (గుడూరు గ్రామం, కర్నూలు జిల్లా)

5)         మీదివేముల అయ్యన్న (31) (గుడూరు గ్రామం, కర్నూలు జిల్లా)

About Author