గ్యాంగ్ రేప్ కేసు.. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా రాజీనామా చేసేది లేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : అమ్నీషియా పబ్ మైనర్ రేప్ కేసులో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసివుల్లా కొడుకు నిందితుడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగినప్పట్నుంచీ చైర్మన్ పదవికి ఆయన అనర్హుడని.. రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనతో రాజీనామా చేయించాలని హోం మంత్రి మహమూద్ అలీ కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాజీనామా చేయాలని వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌కు టీఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసింది. తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని.. మసివుల్లా చెబుతున్నారు. తనను పదవి నుంచి ఎవరూ తప్పించలేరని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ధీమాగా చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.