గని గ్రామంలో గంగమ్మ జాతర
1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మంగళవారం నాడు మండల పరిధిలోని గని గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ జాతరను నిర్వహించారు మహిళలు అమ్మవారికి బాన కుండలు సమర్పించి. తమను చల్లగా చూడాలని గంగమ్మను వేడుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామం అంతా పాడిపంటలతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు పెద్దన్న వెంకటరమణ భీమన్న రవి తదితరులు పాల్గొన్నారు.