అంబరాన్నంటిన కొత్తపేట గంగానమ్మ సంబరాలు..
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక ఏలూరు కొత్తపేట 42 వ డివిజన్లో వేంచేసి ఉన్న గంగానమ్మ, పోతురాజు బాబు స్నాన సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 108 మంది సుహాసినీలు , అలాగే 101 మంది అక్క, చెల్లెల్లు కలిసి మొత్తం 250 పైచిలుక కలశాల బిందెలతో నగర పురవీధులలో భారీ ఊరేగింపు ప్రదర్శన చేశారు. అనంతరం ఘటాల ఊరేగింపు నిర్వహించగా భక్తులు దారి పొడవునా అమ్మవారికి పోతురాజు బాబుకు నీరువారపోసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం మరల అమ్మవారికి ధూప, దీప, నైవేద్యాలతో అమ్మవారిని నగర పురవీధులలో భజనల తో ఊరేగించారు.ఈ నేపథ్యంలో సినీ కోయ డాన్స్ ,భూత ,బేత వేషధారణ ,కోలాటం ,శక్తి వేషాలు తో కళాకారులు అలరించారు.. బాణాసంచాలు, టపాసులు, జువ్వలు, చుంచు బుడెలు, కాల్చారు విద్యుత్ అలంకరణ లైట్లు పచ్చిపూల డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు మూడు డివిజన్లు కలిపి చేసుకునేవారుమని ఈ సంవత్సరము మొట్టమొదటగా మేము స్వయంగా చేసు కొన్నాం అని తెలిపారు. మాకు సహాయ, సహకారాలు అందించిన పురప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, డివిజన్ పెద్దలకు, పోలీస్ శాఖ వారికి ,యావన్మంది భక్తులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈరోజు వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి కుంభం పోసి, చల్దిఉప్పారం తో పాటు. బూరెలు, గారెలు, పులిహోర ,క్షీరన్నం తో నైవేద్యం సమర్పించి భక్తులందరూ మొక్కులు తీర్చుకున్నారని ఇదేవిధంగా ప్రతి సంవత్సరము ఉత్సవాలు జరిపించి గ్రామదేవతలను శాంతింప చేస్తే ప్రతి గ్రామం అమ్మవారు, పోతురాజు బాబుల కరుణాకటాక్షాలతో అందరూ కూడాసుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో చల్లగా జీవిస్తారని అన్నారు. ప్రతి పండుగలో అందరూ చిన్న తనంలోనే ఉత్సవాల్లో పాల్గొన్నట్లయితే స్నేహ సంబంధాలు ,ఆధ్యాత్మిక చింతన, భక్తి భావన పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు .ఈ రోజు కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకొన్నారు.