PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గంగూభాయి సినిమా.. వేశ్య పాత్ర పై తనయుడి ఆగ్రహం

1 min read

పల్లెవెలుగువెబ్ : ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన చిత్రం గంగూబాయి కథియావాడి. ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా పై గంగూభాయి ఫ్యామిలీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, మనవరాలు భారతి ఈ చిత్రం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. తన తల్లిని వేశ్యగా మార్చారని, తన అమ్మ వేశ్యనా లేదా సామాజిక కార్యకర్తనా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి మాటలు తమను బాధిస్తున్నాయని చెప్పారు. అమ్మ గురించి ఇలాంటి మాటలు వింటుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని తెలిపారు.

              

About Author