NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా గంగుల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు,చాగలమర్రి: చాగలమర్రి మండలంలో మాజీ ప్రభుత్వ విప్పు మాజీ శాసనమండలి సభ్యులు గంగుల ప్రభాకర్ రెడ్డి జన్మదినము గ్రామ గ్రామాన, వాడ వాడల వైయస్సార్ కార్యకర్తలు, గంగుల అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల పరిధిలోని రాంపల్లి గొడిగునూరు, ముత్యాలపాడు చింతలచెరువు, చాగలమర్రి, పెద్ద భోదనం, చిన్న భోదనం పలు గ్రామాలలో గంగుల ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి కేకు మిఠాయిలను పంచిపెట్టారు. కొందరు కార్యకర్తలు గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని దేవాలయాల్లో, పేదలకు అన్నదానము చేశారు. మండలంలోని గోడిగనూరు సీనియర్ వైకాపా నాయకులు ఆ గ్రామ ఎంపిటిసి పత్తి నారాయణ, గ్రామ సర్పంచ్ ఛీపాటి సంజీవ రాయుడు, నానుబాల సంజీవ రాంపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు తోపుల నరసింహుడు మేకల రామకృష్ణ, మేకల రఘురామయ్య, ముత్యాలపాడు శేషు రమేష్, చింతల్చెరువు వేణుగోపాల్, దండి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి నరసింహారెడ్డి చిన్న వంగలి లక్ష్మిరెడ్డి బంగారు షరీఫ్ ప్రభు కాంతయ్య బ్రాహ్మణ పల్లె బోల్లవరపు శ్రీనివాసరెడ్డి వెంకటసుబ్బారెడ్డి రమణారెడ్డి ఓబుల్ రెడ్డి బాలకృష్ణారెడ్డి నరసింహారెడ్డి ఆయా గ్రామ నాయకులు సర్పంచులు పెద్ద ఎత్తున గంగుల జన్మదినాన్ని జరుపుకొని ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

About Author