ఫైనల్ మ్యాచ్‌లో ‘గని’
1 min readసినిమా డెస్క్ : ఎఫ్ 2, గద్దలకొండ గగణేష్ వంటి వెరైటీ కాన్సెప్టులతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ ఇప్పడు ‘గని’ బాక్సర్‌గా రానున్నాడు. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ మళ్లీ స్టార్టయ్యింది. ఈ చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో పతాక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించే వరుణ్ బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులతో తలపడుతూ రక్తం చిందిస్తున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన హై ఇంటెన్సిటీ బాక్సింగ్ ఎపిసోడ్లను షూట్ చేస్తున్నారు. ఇది వరుణ్ తేజ్ కెరీర్లో వస్తున్న పదో సినిమా. తను నటిస్తున్న మొదటి స్పోర్ట్స్ బేస్ట్ మూవీ. దీని కోసం వరుణ్ బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నాడు.
కిరణ్ కొర్రపాటి గని చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు వెంకట్‌తో పాటు సిద్దు ముద్దా కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి కీలక రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ వరుణ్‌కి జోడీగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.