గంజాయి,గుట్కా, మత్తు పదార్థాలను అరికట్టాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం మండలంలో విద్యార్థులు, యువత భవిష్యత్తును కాలరాస్తున్న గంజాయి,గుట్కా,మత్తు పదార్థాలను అరికట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బత్తిని ప్రతాప్ వనం వెంకటాద్రి,పాణ్యం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పీ అశోక్ గారికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాణ్యం మండలంలో గంజాయి గుట్కా ,మత్తుకు విద్యార్థులు, యువత బానిసలుగా మారుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 75% యువకులకు మత్తుపదార్థాలు చేరువవుతున్నాయని వాటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులు తీసుకొని అరికట్టాలని స్కూల్లో కళాశాలలో చదివే విద్యార్థులు ఎక్కువగా వీటికి బానిసలు అవుతున్నారని తెలిపారు. విద్యార్థులకు కళాశాలలో పాఠశాలల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు.అలాగే పాణ్యం మండల కేంద్రం లో ప్రతి షాప్, హోటల్ లు క్షుణ్ణంగా పరిశీలించి మత్తు పదార్థాలు దొరికిన షాప్ లను వెంటనే సీజ్ చేసి వారిపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్ష పడేలా చెయాలని వారు కోరారు ఈ కార్యక్రమం లో సీఐటీయూ కార్యకర్తలు శ్రీకాంత్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.