గరుడ కంటి .. దంత వైద్యశాల ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : అజిత్ సింగ్ నగర్ లో గరుడ కంటి &దంత హాస్పటల్ మాజీ మంత్రివర్యులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని )చేతుల మీదుగా ఆదివారం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్ లో గరుడ కంటి &దంత వైద్యశాల ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ,ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవలని అన్నారు .అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమి రెడ్డి మాట్లాడుతూ మిడిల్ క్లాస్ ,లోయర్ మిడిల్ క్లాస్, అజిత్ సింగ్ నగర్ వాసులకు ఈ హాస్పిటల్ చాలా ఉపయోగపడుతుందని , నిర్వాహకులు శ్రీ హర్ష ,ఇబ్రహీం లను అభినందిస్తున్నానని అన్నారు. సేవా కార్యక్రమముల ద్వారా సేవ చేయాలని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించాలని ఆయన అన్నారు .నిర్వాహకులు శ్రీ హర్ష, ఇబ్రహీం మాట్లాడుతూ తిరువూరు .నందిగామ మా బ్రాంచీలు ఉన్నాయని,జయవాడలో ఈ బ్రాంచ్ మూడో బ్రాంచ్ అని 10 సంవత్సరాలు వైద్య రంగంలో మాకు అనుభవం ఉందని, ఓ పి నెల రోజులు వరకు ఫ్రీగా చేస్తామని, అత్యాధునిక పద్ధతిలో కంటి మరియు దంత పరీక్షలు నిర్వహించి కుట్లు లేకుండా నూతన పద్ధతుల ద్వారా ఆపరేషన్ చేస్తామని ఆయన అన్నారు .ఈ హాస్పిటల్ లో ఇద్దరు డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారని కంటికి సంబంధించి కంటిలో పొర ,నీటి కాసులు ఇతర వ్యాధులు నూతన పద్ధతుల ద్వారాట్రీట్మెంట్ చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ రుహలా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.