గ్యాస్ సిలిండర్ లీక్.. ఎమ్మెల్యే భార్యకు మంటలు !
1 min read
fire isolated over black background
పల్లెవెలుగువెబ్ : తెలంగాణలోని మెట్‌పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. వంటగదిలో పిండివంటలు చేస్తుండగా.. గ్యాస్ సిలిండర్ లీకై ప్రమాదం జరిగింది. సంక్రాంతిని పురస్కరించుకొని సకినాలు చేస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే సతీమణి సరోజకు మంటలు అంటుకున్నాయి. వెంటనే బంధువులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.