గ్యాస్ ధరలు పెంపు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : దేశంలో ఒకవైపు నిత్యావసర ధరలు పెరిగాయి. మరోవైపు పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇవన్నీ చాలవన్నట్టుగా గ్యాస్ ధరలు కూడ పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర 25 రూపాయాలు పెంచుతూ.. కమర్షియల్ సిలిండర్ ధర 84 రూపాయలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గత ఆరె నెలల్లో వంట గ్యాస్ సిలిండర్ ధర 140 రూపాయలు పెరగడం గమనార్హం. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 100 రూపాయలు పెరిగింది.