జగన్ పై గౌరు వెంకటరెడ్డి ఫైర్
1 min read
పల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి … పథకాలు అందక ప్రజలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జనగణమన తరువాతనే కొత్త జిల్లాలని, తెలంగాణలో ఇంత వరకు కొత్త జిల్లాల కేంద్రం ఆమోదం తెల్పలేదన్నారు. పాణ్యం, గడివేముల నంద్యాల డివిజన్లో ఉన్నాయి కాబట్టి, నంద్యాల జిల్లాలో ఓర్వకల్లు , కల్లూరు కర్నూల్ డివిజన్లో ఉన్నాయి కాబట్టి కర్నూలు జిల్లాలోని కలపాలన్నారు.