16 నుండి గౌరీపట్నం మేరీ మాత ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు,ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం రాష్ట్ర మరియు ఉభయ గోదావరి జిల్లాల ప్రఖ్యాతిగాంచిన మేరీమాత ఉత్సవాలు బుధవారం సాయంత్రంతో ప్రారంభమయ్యాయి,ఏలూరు పీఠాధిపతి మహాగన డాక్టర్ జయరావు పొలిమేర పతాకావిష్కరణ చేసి ప్రారంభిస్తారని గౌరీపట్నం విచారణ గురువులు ఫాదర్ జాన్ పీటర్ ఒక ప్రకటనలో తెలిపారు,ఈ ఉత్సవాలు మార్చి22 నుండి 25 తేదీ వరకు కొనసాగుతాయని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చి మేరీ మాత అమ్మ దీవెనలు పొంది ప్రార్థనలు జరిపి మొక్కుబడులు చెల్లించుకుంటారన్నారు,వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పక పాటించి దేవాలయ విచారణ సంఘ కాపరులకు సహకరించాలని సూచించారు,దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు నిత్య అన్నదానం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని.అదేవిధంగా పారిశుద్ధ్యం,త్రాగునీరు, మెడికల్ క్యాంప్,విద్యుత్ కాంతులు,పోలీస్ బందోబస్తుతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు,మీ ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించి మేరీమాత దీవెనలు ఆశీస్సులు పొంది తిరిగి ఆనందంగా తమ తమ ప్రదేశాలకు సురక్షితంగా చేరుకోవాలని ఫాదర్ జాన్ పీటర్ విజ్ఞప్తి చేశారు.