NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆత్మీయ విందుకు హాజరైన గౌరు , మాండ్ర

1 min read

– గ్రామాల్లో టిడిపి చేసిన అభివృద్ధి తప్పా,ఇప్పుడు చేసిన అభివృద్ధి శూన్యం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రమైన మాజీ సహకార సొసైటీ చైర్మన్ టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓఆత్మీయ విందు కార్యక్రమానికి టిడిపి రాజకీయ ప్రముఖులు, నాయకులు భారీగా హాజరయ్యారు.మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈవిందు కార్యక్రమానికి నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు నందికొట్కూరు టిడిపి సమన్వయకర్త గౌరు వెంకటరెడ్డి,నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి లకు ఖాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు.రమేష్ రెడ్డి స్వగృహంలో కార్యకర్తలతో కాసేపు వారు ముచ్చటించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్దే తప్పా ప్రస్తుతం ఈప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు.వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యం చేయాలని వారు కార్యకర్తలకు తెలియజేశారు.తర్వాత వారు ఆత్మీయ విందును స్వీకరించారు.ఈకార్యక్రమంలో మాజీ కేడీసీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి,నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,బండి జయరాజ్,ఖాతా రామచంద్రా రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,రాజారెడ్డి,మోహన్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,ఖాతా పక్కి రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,వివిధ మండలాల పార్టీ కన్వీనర్లు నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి, నంద్యాల జిల్లా టిడిపి మైనారిటీ కార్యదర్శి సుల్తాన్,ఐటీడీపీ మండల కన్వీనర్ ఇంతియాజ్,చింతలపల్లి వెంకటేశ్వరరెడ్డి,సంపంగి రవీంద్రబాబు,నాగేంద్రుడు,సర్వోత్తమ్ రెడ్డి,సోపి సాహెబ్,మొల్ల చాకర్ వలి,గోకారి,శ్రీనివాసరెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు ఈవిందులో పాల్గొన్నారు.

About Author