చక్రం తిప్పుతున్న గౌరు వెంకట్ రెడ్డి..
1 min read– జిల్లాలో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర
– పసుపు సైన్యానికి దిశా నిర్దేశం
పల్లెవెలుగు వెబ్ పాణ్యం : గడివేముల.. ఈనెల 12వ తేదీ అనంతపురం నుండి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశించనున్న సందర్భంగా నంద్యాల జిల్లా టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు గౌరవ వెంకట్ రెడ్డి పాదయాత్ర విజయవంతం చేయడానికి పావులు కదుపుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు పర్యటనను జిల్లాలో విజయవంతం చేయడంలో గౌరు వెంకట్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అధిష్టానం దృష్టిలో ప్రత్యేక ముద్రవేశారు ఏ పార్టీలో ఉన్న ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడంలో గౌరు దిట్ట పదవులు కంటే స్వచ్ఛమైన రాజకీయాలే తమ అభిమతం అని ఎన్ని సంవత్సరాలైనా పదవుల కోసం కాకుండా. తనను నమ్ముకున్న క్యాడర్ పాణ్యం నియోజకవర్గ ప్రజల సమస్యల పై గళం విప్పుతూనే ఉంటామని పాణ్యం టిడిపి ఇన్చార్జి గౌరు చరితారెడ్డి వెంకట్ రెడ్డి తెలపడం బాదుడే బాదుడు ఇదేం కర్మ కార్యక్రమాలను ప్రజలలో తీసుకువెళ్లడం పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల పాణ్యం మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలని ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వడం అధికారంలో లేకపోయినా ఎప్పుడు ప్రజలలో ఉండడం. కల్లూరు అర్బన్ లో 1. 80000 మంది మంది ఓటర్లు ఉన్న ప్రాంతంలో రోజు కల్లూరు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను వింటూ ఈసారి అధికారంలో వస్తే కచ్చితంగా సమస్యలను తీస్తామని హామీ ఇస్తూ ముందుకు వెళుతుండడంతో నియోజకవర్గంలో టిడిపికి బూస్ట్ గా మారాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి రాయలసీమ ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకోవడంలో గౌరు వెంకట్ రెడ్డి వ్యూహాలు జిల్లాలో పని చేశాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కీప్ ఇట్ అప్ గౌరు అని భుజం తట్టడం పని చేసే విధానంలో ప్రత్యేక మార్క్ ను ఆచరించడం 2024 ఎన్నికల్లో పాణ్యం విజయం అధికార పక్షానికి అంత ఈజీ కాదని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విజయం నల్లేరుపై నడక కాదని ఈసారి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర విజయవంతం చేసి అధికార పక్షం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకువెళ్తామని గౌరు వెంకట్ రెడ్డి తెలిపారు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర విజయవంతం కావడంతో ఈసారి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనేలా రూట్ మ్యాప్ ని ఇప్పట్నుంచే సిద్ధం చేస్తున్నట్టు నియోజకవర్గంలో ఈసారి టిడిపి అభ్యర్థిగా గౌరు చరిత రెడ్డి విజయ్ దుందుభి మోగించెలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు .. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు మాత్రం తప్పేలా లేదు. 2024 బాద్షా ఎవరో ప్రజలు నిర్ణయించడం ఖాయం.