NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీడియా బిజినెస్ లోకి గౌతమ్ అదానీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌత‌మ్ అదానీ మీడియా రంగంలోకి ప్రవేశించారు. డిజిటల్‌ బిజినెస్‌ న్యూస్‌ సంస్థ క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో మైనారిటీ వాటా కొనుగోలు చేశారు. అయితే ఎంత వాటా, ఎంత మొత్తానికి కొన్నారనే విషయాన్ని రెండు సంస్థలు వెల్లడించలేదు. టీవీ18 మాజీ ప్రమోటర్‌ రాఘవ్‌ బహాల్‌.. క్యూబీఎంపీఎల్‌ను ప్రమోట్‌ చేశారు. వ్యాపార, ఆర్థిక వార్తలు అందించే క్యూబీఎం సంస్థ బిజినెస్‌ న్యూస్‌ కోసం బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థతో కలిసి బ్లూమ్‌బర్గ్‌క్వింట్‌ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ నడుపుతోంది. అదానీ గ్రూప్‌ ప్రవేశించే ముందే బ్లూమ్‌బర్గ్‌ ఈ వెంచర్‌ నుంచి తప్పుకుంది.

                                        

About Author