PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారెన్ బ‌ఫెట్ ను అధిగ‌మించిన గౌత‌మ్ అదానీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మ‌రింత ముందుకు వెళ్లారు. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించి ప్రపంచ సంపన్నుల జాబితాలో 5వ స్థానానికి ఎగబాకారు. ఈ మేరకు ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా విడుదలైంది. ఫోర్బ్స్ డేటా ప్రకారం.. 91 ఏళ్ల వారెన్ బఫెట్ సంపద విలువ 121.7 బిలియన్ డాలర్లు కాగా.. అదానీ ఆస్తుల విలువ 123.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే షేర్లు శుక్రవారం 2 శాతం మేర పతనమవ్వడంతో ఆయన సంపద విలువ తగ్గింది. అమెరికా మార్కెట్లు గత శుక్రవారం నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలోనే బెర్క్‌షైర్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి.

                                 

About Author