గాయత్రీ గోశాలకు రూ. 50 వేలు విరాళం
1 min read
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగరశివారులోని గాయత్రీ గోశాలకు తానా మాజీ కార్యదర్శి రవి పొట్లూరి విరాళం అందజేశారు. గోశాల నిర్వహణకు గాను ఆయన రూ. 50 వేలు అందించారు. మౌర్య ఇన్ లో చెక్కును టి.జి.వి సంస్థల చైర్మన్ టి.జి భరత్ కు అందజేశారు. గోసేవలో భాగంగా విరాళం ఇస్తున్నట్లు రవి పొట్లూరి తెలిపారు. గోశాల నిర్వహణ కోసం సహాయం చేయడం సంతోషించదగ్గ విషయమని టి.జి భరత్ ఈ సందర్భంగా ఆయన్ను అభినందించారు.