గెజిట్ నోటిఫికేషన్.. సీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు : మైసూరారెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ : రాజకీయ లబ్ధి కోసం ఇద్దరు సీఎంలు ఘర్షణపడి రాయలసీమ ప్రాజెక్టులు గందరగోళంలోకి నెట్టేశారని మాజీమంత్రి మైసూరారెడ్డి ఆరోపించారు. నదీ జలాల వివాదంపై ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఓ ప్రభుత్వం ఉండి ఉంటే అన్యాయం జరిగి ఉండేది కాదన్నారు. రాష్ట్రానికి కేటాయించిన జలాలు ఆయా ప్రాజెక్టులకు కేటాయించే స్వేచ్చ ఏపీకి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అని మైసూరారెడ్డి ఆక్షేపించారు.