అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీశ్రీశ్రీ రాజయోగానంద గీతామందిర ద్వాదశ వార్షికోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: అశాంతికి కారణం అజ్ఞానమని, ఆత్మ జ్ఞానమే మోక్ష కారకమని ఉరవకొండ గవిమఠం పీఠాధిపతులు డాక్టర్ శ్రీశ్రీశ్రీ కరిబసవ రాజేంద్ర మహా స్వామీజీ ఉద్బోధించారు. పత్తికొండ మండలం, పెద్ద హుల్తి గ్రామంలో వెలసిన శ్రీరాజయోగానంద గీతామందిరం ద్వాదశ వార్షికోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పీఠాధిపతులు, మఠాధిపతులచే వేదాంత మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీలు ప్రవచిస్తూ ఈనాడు సమాజానికి ఎదురవుతున్న అనేక సవాళ్ళను అధిగమించాలంటే సనాతన ధర్మ వ్యాప్తియే మార్గమని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో లత్తవరం శ్రీ ఉమామహేశ్వర పీఠాధ్యక్షులు ప్రణవానందగిరి స్వామి, ఉరవకొండ గవిమఠము పీఠాధిపతులు కరిబసవ రాజేంద్ర మహాస్వామి, శంకరానందగిరి సేవాశ్రమము కొక్కెరచేడు శ్రీ గురు చరణానందగిరి మాతాజీ, శ్రీ కాశినాయన అన్నదానఆశ్రమం నిత్యానంద భారతి స్వామి, చాగలమర్రి వేదాంత ఫౌండేషన్ శివరామానంద ఆశ్రమం శ్రీ అభినవ శంకరానందగిరి స్వామి, రాయదుర్గం శ్రీ రాజవిధ్యానందాశ్రమం పీఠాధిపతులు శ్రీ వాసుదేవానంద స్వామి, విశాఖపట్నం అనాధీశ్వర పీఠాధిపతులు శ్రీ శివానంద మాతాజీ, శ్రీ చిన్మయ మిషన్ కర్నూలు బాధ్యులు స్వామిని సుప్రేమానంద, ఉమామహేశ్వర పీఠం మఠాధిపతి మహేశ్వరానందగిరి స్వామి, తిరుపతి తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఆశ్రమ అధ్యక్షులు ఎస్. శ్రీనివాసానంద స్వామి , కార్యదర్శి భీమలింగారెడ్డి, కోశాధికారి కారుమంచెప్ప, వెంకటేశ్వర్లు, హుల్తెన్న , శేఖర్, నాగరాజు తోపాటు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామీజీలను అందరినీ రెండు వాహనాలలో పురవీధులగుండా ఊరేగింపు నిర్వహించారు.