NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో GEMCARE కామినేని హాస్పిటల్

1 min read

ముఖ్య అతిథిలుగా విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్​

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: అత్యాధునిక టెక్నాలజీతో.. మెరుగైన.. శరవేగంగా ప్రజలకు వైద్యం అందించేందుకు కర్నూలులో GEMCARE కామినేని హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​. గురువారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్​ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన GEMCARE కామ్ నేని హాస్పిటల్ ను  ఎంపీతోపాటు  మేయర్​ బీవై రామయ్య, సీనియర్​ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ  హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కామినేని హాస్పిటల్స్, కొత్తగా కర్నూలులో 150 పడకలతో హాస్పిటల్ ను  ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.  అనంతరం  ‘జెమ్​కేర్​ కామినేని హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ  దాదాపు 20 రకాల స్పెషాలిటీ విభాగాల్లో చికిత్సలు అందిస్తామని తెలియజేశారు. కొత్త ఆసుపత్రిలో ప్రత్యేకంగా 75 పడకల కేన్సర్ చికిత్సల విభాగాన్ని  ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కామినేని హాస్పిటల్స్ ప్రస్తుతం 3,000 పడకలకు పైగా సామర్థ్యంతో ఆసుపత్రులను నిర్వహిస్తోంది. వైద్య కళాశాల, దంత వైద్య కళాశాలలూ కామినేని గ్రూపు సారథ్యంలో నడుస్తున్నాయని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు.ఈ కార్యక్రమం లో ఉస్మానియా కాలేజ్ ప్రిన్సిపాల్ సమిద్దీన్ సార్, వైఎస్ఆర్సిపి  కార్పొరేటర్లు  తదితరులు పాల్గొన్నారు.

About Author