PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటికీ మహిళలు ఇంకా లింగ వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు..

1 min read

ఎంత ఉన్నత స్థానంలో ఉన్న సమాజంలో నేటికీ మహిళలు లింగ వివక్షత కి గురవుతున్నారు

రాష్ట్ర యువజన సర్వీస్ ల శాఖ కమిషనర్ శారదాదేవి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించడానికి,లింగ సమానత్వం మరియు సామాజిక మార్పుకు ప్రేరణ తీసుకొని రావడానికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదికగా ఉంటుందన్నారు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శారదా దేవి. స్థానిక సెయింట్ థెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో మంగళవారం రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మరియు సెయింట్ థెరెసా మహిళా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. సమాజంలో నేటికీ మహిళలు ఇంకా లింగ వివక్షతకు గురి అవుతూనే ఉన్నారని, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత ప్రగతిని సాధించినప్పటికీ వారు అణచివేతకు గురవుతూనే ఉన్నారు అన్నారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ థీమ్ ఇన్స్పైర్ ఇంక్లూజన్ ను ఎంచుకోవడం జరిగిందని తద్వారా మహిళలలో పెట్టుబడిని పెట్టి వేగవంతం చేయడానికి సాధ్యమవుతుందన్నారు. మహిళల ఆర్ధిక నిర్వీర్యతను దూరం చేయడానికి ఇది ఒక సుగమమైన మార్గం అన్నారు. ఈ సందర్భంగా ఆమె కమల హారిస్, ద్రౌపది ముర్ము లాంటి ఉన్నత స్థానాలలో ఉన్న స్త్రీమూర్తులను స్మరించుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ మెర్సి మాట్లాడుతూ మన సంస్కృతిలో మాతృమూర్తి స్థానం వేరే ఎవరికీ ఇవ్వ లేనిదని, ఆమె సామర్థ్యంతో కుటుంబాన్ని ఉన్నత స్థితికి చేర్చడానికి కారణం అవుతుందని అన్నారు. నేటికీ కొన్ని కుటుంబాలలో మగదక్షత లేని చోట స్త్రీ తన కుటుంబానికి ఆధారంగా నిలబడి కుటుంబ ఉన్నతికి పాటుపడుతుందని తెలియజేశారు.బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు సమత మరియు హబీబా భారతదేశంలో మహిళా సాధికారతను గురించి, ఒక స్త్రీమూర్తులను గురించి ఉపన్యసించారు.అనంతరం రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శ్రీమతి శారదను, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సి ని, కళాశాల భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ నిర్మల జోత్స్నను, యువజన సర్వీసుల శాఖ మరియు కళాశాల అధ్యాపకులు సత్కరించారు. కార్యక్రమాన్ని యువజన సర్వీసుల శాఖ మరియు కళాశాల విమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సెటిల్ సీఈవో శ్రీ మెహరాజ్, విమెన్ సెల్ సభ్యులు డాక్టర్ పద్మావతి, రాణి, సరస్వతి మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. నిర్వాహకులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియ క్రిస్టియా మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిస్టర్ సుశీల అభినందించారు.

About Author