NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాకు ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కె.సునీత రాక

1 min read

స్వాగతించిన జిల్లా కలెక్టర్ కె.వేట్రి సెల్వి, ఎస్పి ప్రతాప్ శివ కిషోర్, జెసి

పి.ధాత్రి రెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో  ఎన్నికల పరిశీలకురాలు కె.సునీత సోమవారం ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా  ఎన్నికల పరిశీలకురాలు కె.సునీత కు  జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వెట్రిసెల్వి  మొక్కను అందించి స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఎన్నికల పరిశీలకురాలు కె.సునీత ను  జిల్లా ఎస్పీ కె.పీ.ఏస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం  తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల  నామినేషన్ల దాఖలు, తదితర అంశాలను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జిల్లా ఏస్ కె.పీ.ఏస్ కిషోర్ లను  ఆమె  అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు,ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్ కూడా వారితో పాటు వున్నారు.

About Author