28, 29న సార్వత్రిక సమ్మె ఏఐటీయూసీ
1 min readఆస్పరి: మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర ఏఐటీయూసీ మండల కార్యదర్శి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సిపిఐ సీనియర్ నాయకులు ఆంజనేయ ఉరుకుంద అప్ప పాల్గొనిజెండా ఊపి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం వందల సంవత్సరాల క్రితం ఉద్యోగులు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు అన్నిటినీ కాలరాస్తూ కార్మిక చట్టాలు మార్పు తెచ్చింది నాలుగు లేబర్ కోడ్స్ ను తెచ్చి కార్పొరేట్ కంపెనీల్లో కార్మికులు బానిసలుగా మార్చడానికి పూనుకుంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు యదేచ్ఛగా కార్మికుల శ్రమను దోచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు ఇన్సూరెన్స్ టెలికాం రైల్వే, పోస్టల్ పోర్టులు విద్యుత్ సమస్యల తో సహా అన్నిటిని ప్రైవేటీకరించి విదేశీ కంపెనీలకు స్వాధీనం చేయాలని నిర్ణయించింది దీంతో ఆ దాని అంబానీ వారి సంపద పెరగడానికి అవకాశం కల్పిస్తుంది ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు ఎలా అప్పజెప్పిన దో ప్రజలు చూశారు దీనివలన లక్షలాది మంది ఉద్యోగులు భద్రత పోయింది కావున ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుందామని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కనీస వేతనాల చట్టం అమలు చేయాలని ఈ నెల 28, 29 తేదీలలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య హమాలీ సంఘం అధ్యక్షులు హనుమంతు ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఈశ్వర్ ఏఐటీయూసీ నాయకులు బాలకృష్ణ మహేంద్ర ఆచారి వీరేశ్ మహానంది రంగస్వామి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.